అక్కినేని అఖిల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ…

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ‌లు అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్. యంగ్ అండ్ డైన‌మిక్ అఖిల్ అక్కినేని తాజా సినిమాను నిర్మిస్తున్నాయి. అఖిల్ 6ని అక్కినేని నాగార్జున‌, నాగ‌వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అక్కినేని అఖిల్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని అఖిల్ 6వ చిత్రానికి లెనిన్ అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ని ప్ర‌క‌టించారు. ముర‌ళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు ముర‌ళీకిశోర్ అబ్బూరు. ఇంట‌న్స్, యాక్ష‌న్ ప్యాక్డ్ ఎక్స్ పీరియ‌న్స్ తో రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో రోమాలు నిక్క‌బొడుచుకునేలా సాగింది లెనిన్ గ్లింప్స్.

టైటిల్ గ్లింప్స్ పవర్‌ఫుల్ విజువల్స్‌తో ప్రారంభమయింది. ఆధ్యాత్మిక అంశాల‌ను చొప్పిస్తూ ఆద్యంతం ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు మేక‌ర్స్. అఖిల్ అక్కినేని… స్ట‌న్నింగ్ లెనిన్ కేర‌క్ట‌ర్‌కి అద్భుతంగా సూట్ అయ్యారు. ఆయ‌న ద‌ట్ట‌మైన మీసం, పొడ‌వాటి జుట్టు, మ్యాచో అవ‌తార్‌కి ప‌క్కాగా సూట్ అయ్యాయి. స్ట్రైకింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేశారు అఖిల్‌. అఖిల్ స‌ర‌స‌న శ్రీలీల న‌టిస్తున్న విష‌యం గ్లింప్స్ లో రివీల్ అయింది.

టైటిల్ గ్లింప్స్‌లో మాసివ్ యాక్ష‌న్ మొమెంట్స్, పంచ్ మాత్ర‌మే కాదు ప‌వ‌ర్‌ఫుల్ డైలాగు కూడా ఆడియ‌న్స్ ని క‌ట్టిప‌డేసింది.
“పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుంది రా, పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది“ అని రాయలసీమ స్లాంగ్‌లో అఖిల్ చెప్పిన‌ డైలాగ్ సింపుల్‌గా అదుర్స్ అంతే. సినిమాలో ఎమోష‌న్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్ప‌క‌నే చెప్పింది. యాక్షన్ క‌మ‌ర్షియ‌ల్‌ ఎంటర్టైనర్‌కి ఉండాల్సిన ప‌క్కా డైలాగులు ఉన్నాయ‌నే ఫీల్‌ని క్రియేట్ చేసింది.
అఖిల్ రాయలసీమ స్లాంగ్‌ను అద్భుతంగా అర్థం చేసుకుని ప‌ట్టుకోగ‌లిగారు. ఆయన వాయిస్ మోడ్యూలేషన్ పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. విజువల్స్, టోన్… ప్ర‌తిదీ టైటిల్ గ్లింప్స్ కి బ‌లం చేకూర్చేలా ఉంది.

“ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మ‌క‌మైన‌ది కాదు“ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్‌. లెనిల్‌లో ప్రేమ‌కున్న ప్రాధాన్య‌త‌ను సంపూర్ణంగా చెప్పే ట్యాగ్ లైన్ ఇది. రా ఎమోష‌న్స్ ఎలా ఉండ‌బోతున్నాయో ఉప్పందించేసింది. సినిమాటోగ్రాఫ‌ర్ న‌వీన్ కుమార్ విజువ‌ల్స్ కి ప్ర‌త్యేక అభినంద‌న‌లు అందుతున్నాయి. ఇంటెన్స్ ఉన్న స‌న్నివేశాల‌ను త‌మ‌న్ త‌న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మ‌రో రేంజ్‌కి తీసుకెళ్లారు. ఎడిట‌ర్ న‌వీన్ నూలీ షార్ప్ క‌ట్స్ ఎలా ఉంటాయో గ్లింప్స్ చెప్ప‌క‌నే చెప్పేసింది. ముర‌ళీ కిశోర్ అబ్బూరు విజ‌న్‌ని ఫ్యాన్స్ కి చేర్చ‌డానికి టెక్నీషియ‌న్లంద‌రూ ప‌ర్ఫెక్ట్ గా కుదిరారు. అద్భుత‌మైన విజువ‌ల్స్, ఎక్స్ ట్రార్డిన‌రీ ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ క‌ల‌గ‌లిసి ఫ్యాన్స్ కి నెవ‌ర్ బిఫోర్ విజువ‌ల్ ఎక్స్ పీరియ‌న్స్ ఇవ్వ‌డం గ్యారంటీ.
ఒళ్లు గ‌గుర్పొడిచేలా సాగింది లెనిన్‌ టైటిల్ గ్లింప్స్. పవర్‌ఫుల్ ఎంటర్టైనర్ కి సంబంధించి ప్ర‌తి చిన్న విష‌యాన్నీ అర్జంటుగా తెలుసుకోవాల‌న్న క్యూరియాసిటీ క‌లిగించింది గ్లింప్స్. లెనిన్‌కి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామంటున్నారు ప్రొడ్యూస‌ర్లు.