గోవా అయ్యింది ఇక హైదరాబాద్ మిగిలింది…

akash puri

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా రొమాంటిక్. పూరి అసిస్టెంట్ అనీల్ పాడూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. రమ్యకృష్ణ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు మూడు వారల పాటు జరిగిన ఈ గోవా షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. రొమాంటిక్ కొత్త షెడ్యూల్ ని త్వరలో హైదరాబాద్‌ లో ప్రారంభం కానుంది. ఈ కొత్త షెడ్యూల్ లో హీరో హీరోయిన్ల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ సాంగ్ తో పాటు కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ని షూట్ చేయనున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ తో రొమాంటిక్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కుతుంది.