‘ఆకాశం నీ హ‌ద్దురా’ రివ్యూ

త‌క్కువ ధ‌ర‌కే పేద‌ల‌కు విమాన ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించిన‌ ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ఆకాశం నీ హ‌ద్దురా. ఇవాళ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ సినిమా బాగానే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.

akasameu nee haddura

క‌థ విష‌యానికొస్తే.. ఇందులో హీరో సూర్య పేరు మ‌హా. అత‌డు గుంటూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన మాస్ట‌ర్ కొడుకు. త‌న తండ్రి ఆ గ్రామానికి క‌రెంట్ తీసుకొచ్చాడు. దానిని స్పూర్తిగా తీసుకుని సూర్య త‌న గ్రామానికి రైలు సౌక‌ర్యాన్ని తీసుకురావ‌డంలో కృషి చేస్తాడు. ఆ త‌ర్వాత పేద‌లు కూడా విమానాల్లో ప్ర‌యాణించాల‌నే ఉద్దేశంతో ఎయిర్ డెక్క‌న్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేసి త‌క్క‌వ ధ‌ర‌కే పేద‌లు విమానాల్లో ప్ర‌యాణించే సౌక‌ర్యం క‌ల్పిస్తాడు. త‌క్కువ ధ‌ర‌కే విమాన సౌక‌ర్యం క‌ల్పించాల‌నే ఐడియా సూర్య‌కు ఎలా వ‌చ్చింది? దీని కోసం అత‌డు ప‌డిన క‌ష్టాలేంటి? అనేది క‌థ‌.

గురు సినిమాను తెర‌కెక్కిన లేడీ డైరెక్ట‌ర్ సుధ కొంగ‌ర ఈ సినిమాను త‌న స్ట్రైల్‌లో అద్భుతంగా తెర‌కెక్కించారు. గోపీనాథ్ జీవితంలోని ప్ర‌తి స్టేజీని ఈ సినిమాలో క‌వ‌ర్ చేశారు. ప‌ల్లెటూరి నుంచి విమాన‌యాన సంస్థ అధినేత‌గా ఆయ‌న ఎదిగిన తీరును సినిమాలో అందిరికీ అర్థ‌మ‌య్యేలా బాగా చూపించారు. డైరెక్ట్‌గా జీవిత క‌థ‌ను చెబితే జ‌నాల‌కు బోర్ కొడుతుంది. దీంతో మంచి వినోదాత్మ‌కంగా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడిస్తూ ద‌ర్శ‌కురాలు సినిమా అద్భుతంగా తీశార‌ని చెప్ప‌వ‌చ్చు.ప్ర‌తి సీన్ కూడా ఎమోష‌న‌ల్‌గా ప్ర‌జ‌ల్లో స్పూర్తి నింపేలా సుధ కొంగ‌ర తెర‌కెక్కించారు.

ఇక న‌టీన‌టుల విష‌యానికొస్తే.. సూర్య అద్భుతంగా న‌టించాడ‌ని చెప్ప‌వ‌చ్చు. న‌ట‌న‌లో వేరియేష‌న్స్ చూపిస్తూ సూర్య న‌టించిన సీన్స్ ప్రేక్ష‌కుల‌ను ఖ‌చ్చితంగా ఆక‌ట్టుకుంటాయి. ఇక సూర్య భార్య పాత్ర‌లో అప‌ర్ణ న‌ట‌న బాగానే ఉంది. త‌న పాత్ర‌కు ఆమె న్యాయం చేసింది. ఇక క‌మాండ‌ర్‌గా మోహ‌న్ బాబు న‌ట‌న ఈ సినిమాకు ప్ల‌స్‌గా నిలిచింది. ఇక విల‌న్‌గా ప‌రేశ్ రావ‌ల్ న‌ట‌న బాగుంటుంది.

మైన‌స్‌ల విష‌యానికొస్తే..‌ సూర్య పాత్ర‌కు స‌త్య‌దేవ్ డ‌బ్బింగ్ అంత‌గా సెట్ కాలేదు. సినిమా చాలా లెన్తీగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌లో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. అలాగే ప్రీ క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం కూడా కొంచెం మైన‌స్ అని చెప్ప‌వ‌చ్చు. అలాగే సినిమాలోని కొన్ని సీన్ల‌లో నాటకీయత ఎక్కువైంది.

మొత్తంగా విశ్లేషిస్తే.. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంద‌ని చెప్ప‌వ‌చ్చు.