
కోలీవుడ్ హీరో అజిత్ మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు. బెల్జియంలో జరిగిన సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోరాఛాంప్స్ రేస్లో అజిత్ పాల్గొన్నారు. కానీ రేస్లో నియంత్రణ కోల్పోవడంతో ఆయన నడుపుతున్న కారు ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అజిత్ సురక్షితంగా తప్పించుకున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జెంది. ఇటీవలే అజిత్ కథానాయకునిగా విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మంచి విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే.