అభిమానుల కోసం రిస్క్ చేస్తున్నాడు

కోలీవుడ్ స్టార్ హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోని, స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న హీరో తల అజిత్. రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ సెట్ చేసుకున్న అజిత్ ప్రస్తుతం బోణీ కపూర్ సినిమాలో నటిస్తున్నాడు. స్టార్ హీరో ఏడాదికి ఒక సినిమా చేయడమే కష్టం అయినప్పుడు, అజిత్ మాత్రం రెండు సినిమాలని రిలీజ్ చేసి సూపర్ హిట్స్ ఇచ్చాడు. అందులో ఒకటి సంక్రాంతికి రిలీజ్ అయిన విశ్వాసం కాగా మరొకటి హిందీ ‘పింక్’ రీమేక్ అయిన నేర్కొండ పార్వై. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కోట్ల వసూళ్లు రాబట్టాయి. శ్రీదేవికి ఇచ్చిన మాట కోసం బోణీ కపూర్ నిర్మాణంలో నేర్కొండ పార్వై సినిమా చేసిన అజిత్, ఇప్పుడు అదే బ్యానర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. నేర్కొండ పార్వై సినిమాని డైరెక్ట్ చేసిన హెచ్. వినోద్ ఈ #Thala60 సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం అజిత్, 48ఏళ్ళ వయసులో కూడా వర్కౌట్లు చేస్తూ బాడీ షేప్ ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. డైరెక్టర్ శివతో చేసిన వివేగం సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసిన అజిత్, ఇప్పుడు హెచ్.వినోద్ మూవీ కోసం మళ్లీ జిమ్ బాట పట్టాడు. రోజుకు ఐదు గంటల పాటు జిమ్ చేస్తున్న అజిత్ కి గతంలో ఆరోగ్యం బాగోలేక పోతే డాక్టర్స్ అతన్ని ఎటువంటి వర్కౌట్ లు చేయకూడదని చెప్పారు కానీ అజిత్ మాత్రం సినిమా కోసం అభిమానుల కోసం రిస్క్ చేస్తూనే ఉన్నాడు. జిమ్ లో అజిత్ పడుతున్న కష్టం ఎలా ఉంటుందో తెలియాలి అంటే #Thala60 అప్డేట్ వచ్చే వరకూ ఆగాల్సిందే.