బైక్ రైడింగ్: రికార్డు బ్రేక్ చేసిన హీరో అజిత్

తమిళ స్టార్ హీరో అజిత్ రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ సాహసాలు చేస్తున్నాడు. సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాల్లో హైస్పీడ్‌తో బైక్ నడిపే సీన్లు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అజిత్ రియల్ లైఫ్‌లోనూ అలాగే బైక్‌పై దూసుకెళ్తూ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. బైక్ రైడింగ్‌లో ఏ హీరోలు సాధించలేని ఫీట్‌ను సాధించి రికార్డు సృష్టించాడు.

ajith bike riding

అజిత్‌కు బైక్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. వందల కిలోమీటర్లు అయినా సరే బైక్‌పై ట్రావెల్ చేయడం అజిత్‌కు ఇష్టం. ఇప్పుడు స్టార్ హీరో అయినా సరే.. ఆ ఇష్టాన్ని వదులుకోలేదు. సమయం దొరికినప్పుడల్లా బైక్ డ్రైవ్‌లు చూస్తూ ఉంటాడు. లాక్‌డౌన్‌లో హైదరాబాద్ నుంచి చెన్నైకి అజిత్ బైక్ డ్రైవ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా అజిత్ 4500 కిలోమీటర్లు బైక్‌పై ట్రావెల్ చేశాడు. వారణాసిలో బైక్‌తో దిగిన ఫొటోను తాజాగా సోషల్ మీడియాలో అజిత్ పంచుకున్నాడు. అయితే ఎక్కడి నుంచి వారణాసికి డ్రైవ్ చేశాడనే విషయం ఇంకా బయటికి రాలేదు.