Ajay Devgan: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మ‌రో స‌రికొత్త అప్‌డేట్..

Ajay Devgan: ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్‌, ఓ కీల‌క మైన పాత్ర‌ల్లో బాలీవుడ్ స్టార్ న‌టుడు Ajay Devgan అజ‌య్ దేవ్‌గ‌ణ్ న‌టిస్తున్నారు. భారీ తారాగ‌ణంతో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి ఆయా న‌టీన‌టుల పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్స్ ప్రేక్ష‌కాభిమానుల‌ను ఎంతోగానో ఆక‌ట్టుకున్నాయి. కానీ ఇంత‌వ‌ర‌కు Ajay Devgan అజ‌య్ దేవ్‌గ‌ణ్ లుక్‌ను మాత్రం ఇంకా బ‌య‌ట‌పెట్ట‌లేదు..

ఈ నేప‌థ్యంలో తాజాగా Ajay Devganఆయ‌న లుక్ సంబంధించిన పోస్ట‌ర్ అప్‌డేట్ ప్ర‌క‌టించింది మేక‌ర్స్‌. ఏప్రిల్ 2న అజ‌య్ దేవ్‌గ‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి ఆయ‌న ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తుండ‌గా.. ప్ర‌ముఖ సంగీతం ద‌ర్శ‌కుడు కీర‌వాణీ స్వ‌రాల‌ను అందిస్తున్నాడు.. అక్టోబ‌ర్ 13న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఇదివ‌ర‌కే చిత్ర‌బృందం ప్ర‌క‌టించారు.‌ ‌