Ajay Devghan: నేడు అజ‌య్ దేవ్‌గ‌ణ్ బ‌ర్త్‌డే.. ఆర్ఆర్ఆర్ స‌ర్‌ప్రైజ్ గిప్ట్!

Ajay Devghan: బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ అజ‌య్ దేవ్‌గ‌ణ్ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ మూవీ టీం నుంచి స‌ర్‌ప్రైజ్ వ‌చ్చింది.. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ సినిమాలో తార‌క్‌, చ‌ర‌ణ్‌కు గురువుగా ఆయ‌న క‌నిపిస్తార‌ని తెలుస్తోంది.. ఆయ‌న‌కు జోడీగా శ్రియ శ‌ర‌న్ న‌టిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు.

Ajay Devgan

డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఈ చిత్రంలో తారక్ జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ కాగా.. చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్ న‌టిస్తుంది. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణీ స్వ‌రాలు అందిస్తున్నారు.. అక్టోబ‌ర్ 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం థియేట‌ర్ల‌లోకి రానుంది.‌‌