హాట్ స్టార్ లో టాప్ టెన్ షోస్ లో రెండు వారాలుగా ఫస్ట్ ప్లేస్ లోనే తన సత్తా చాటుతున్న “ఐరావతం” మూవీ.

ఎస్తేర్ నోహ, అమర్ దీప్, అరుణ్ ప్రధాన పాత్రలలో నటించగా ఒక తెల్లటి కెమెరా ఆధారంగా “ఐరావతం” డిస్నీ హాట్ స్టార్ లో హిట్ టాక్ తో స్ట్రీమింగ్ అవుతోంది.. నూజివీడు టాకీస్ అనే బ్యానర్ పైన గుణశేఖర్ శిష్యుడైన సూహాస్ మీరా ఈ మూవీ ని డైరెక్ట్ చేశారు. రేఖ పలగాని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి, లలిత కుమారి తోట నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. “ఫ్యూజన్” సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఐరావతం మూవీ ఈ నెల 17 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో నంబర్ వన్ పొజిషన్లో నే స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఎస్తేర్, అమర్ దీప్, తన్వి నెగ్గి అరుణ్ ల డబుల్ షేడ్ యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో ట్రిక్కీ స్క్రీన్ ప్లే తో గమ్మత్తైన కథ మూవీ చివరి వరకు యంగేజ్ చేస్తాయి.. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ఇంట్రెస్టింగ్ రీరికార్డింగ్ మరియు మూడ్ లైటింగ్ ఇంకా బాగా ఇన్వాల్ అయ్యేట్టు చేస్తాయి.

నిర్మాతలు మాట్లాడుతూ… సుహాిస్ మాకు ఆటవిడుపు గా ఐరావతం కథ చెప్తే విని ఈ కథ లోని స్క్రీన్ ప్లే స్ట్రాటజీ నచ్చి మూవీ తీద్దాం అనుకున్నాం. చివరికి ఈ మూవీ హాట్ స్టార్ కి నచ్చి తీసుకోవడం అనుకోకుండా టాప్ వన్ లో రెండు వారాలుగా ఉండటం జరుగుతుంది.ఒక మంచి కథ ని నమ్మినందుకు చాలా హ్యాపీ గా ఉన్నాం.
దర్శకుడు మాట్లాడుతూ… ఫ్యూజన్ జోనర్ లో తీసిన ఐరావతం హాట్ స్టార్ ప్రేక్షకులకు నచ్చడం చాలా హ్యాపీ. నిర్మాతలకు థాంక్స్. టెక్నీషియన్స్ కు థాంక్స్.

సమర్పణ రేఖ పలగాని,
నిర్మాతలు :రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట
డైరెక్షన్: సుహాిస్ మీరా
సాంగ్స్ రికార్డింగ్: సత్య కశ్యప్
రీ రికార్డింగ్: కార్తిక్ కొడగండ్ల
సాంగ్స్: పూర్ణాచారి
ఎడిటర్: సురేష్ దుర్గం
పి ఆర్ ఓ: మధు
డి టీ ఎస్ మిక్సింగ్ : శ్యామ్
కెమెర: RK వెల్లేపు

నటి నటులు:
అమర్ దీప్
తన్వి నెగ్గి
ఎస్తేర్ నోర్హా
అరుణ్
సంజయ్ నాయర్