తెలుగు, కన్నడ భాషల్లో నిర్మితమవుతున్న”అగ్ని ప్రవ” చిత్రం ప్రారంభం!!

నవరత్న పిక్చర్స్ బ్యానర్ పై వర్ష తమ్మయ్య నిర్మాతగా తెలుగు,కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం “అగ్ని ప్రవ”. సురేష్ ఆర్య దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమయింది. ముహూర్త కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా “బాహుబలి” రైటర్ విజయేంద్ర ప్రసాద్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుమార్తె లక్ష్మీ , అల్లుడు గోవింద రాజు, మరియు ప్రముఖ కన్నడ దర్శకులు జో సైమన్ విచ్చేశారు. అనంతరం

“బాహుబలి ” రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…
‘మా వ్యాయామ శాల(టీం ) లో తయారైన శిష్యుడి కథ విని చాలా సంతోష పడ్డాను. మొదటి చిత్రానికి మంచి కథ తయారు చేసుకున్నాడు సురేష్ ఆర్య..ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు.

నిర్మాత వర్ష తమ్మయ్య మాట్లాడుతూ…
తెలుగులో ఇప్పటి వరకు ఐదు చిత్రాల్లో నటించాను. కన్నడ,తెలుగు భాషల్లో మొదటిసారిగా నటిస్తూ ..నిర్మిస్తున్న చిత్రం”అగ్ని ప్రవ” మహిళా ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కుటుంభం లో జరిగే దౌర్జన్యం. అణిచివేత పై విరుచుకుపడే కెరటంలా ” అగ్ని ప్రవ” చిత్రం ఉంటుందని తెలిపారు. మా చిత్ర ప్రారంభానికి విచ్చేసిన ప్రముఖులకు కృతజ్ఞతలు.. అన్నారు.

చిత్ర దర్శకుడు సురేష్ ఆర్య మాట్లాడుతూ…
విజయేంద్ర ప్రసాద్ గారి టీం లో పనిచేసిన అనుభవంతో యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నానని.. విజయేంద్ర ప్రసాద్ గారి అన్న. రాజమౌళి గారి పెద్దనాన్న . ఎస్.ఎస్.దత్త గారి తో కలిసి ఈ మూవీ కథ చర్చించామని తెలిపారు.రగిలే అగ్ని జ్వాలల స్వభావం ఉన్న నాయకిగా వర్ష తమ్మయ్య నటిస్తున్నారు. ఈ చిత్రానికి “అగ్ని ప్రవ” టైటిల్ పెట్టాము. డిసెంబర్ మొదటి వారం లో షూటింగ్ మొదలు పెట్టి. కూర్గ్, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతామని దర్శకుడు సురేశ్ ఆర్య తెలిపారు.

ఈ చిత్రానికి సహా నిర్మాత గా వ్యవహరిస్తున్న ప్రముఖ దర్శకులు జో సైమన్ కుమారుడు జితేంద్ర సైమన్ మాట్లాడుతూ….
తెలుగు, కన్నడ భాషల్లో “అగ్ని ప్రవ” చిత్రం తెరకెక్కుతుంది.. ఈ చిత్రం అందరికి నచ్చేవిధంగా ఉంటుంది..విజయవంతమై అందరికి మంచి పేరు రావలని కోరుకుంటున్నా అన్నారు

ప్రముఖ దర్శకులు జో సైమన్ మాట్లాడుతూ…
యంగ్ టీం అంతా కలిసి చేస్తున్న “అగ్నిప్రవ” చిత్రం పెద్ద విజయం సాధించాలి. చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.

బ్యానర్ : నవరత్న పిక్చర్స్
సమర్పణ : మ్యాక్స్ వరల్డ్
నిర్మాత : వర్ష తమ్మయ్య
సహా నిర్మాత : జితేంద్ర సైమన్
దర్శకత్వం : సురేష్ ఆర్య
పాటలు : ఎస్.ఎస్. దత్త, డా. రామకృష్ణ, కోడూరి
కథ : ఉదయ్ శెట్టి, యువ, సురేష్ ఆర్య
కెమెరా : లవిత్
ఎడిటింగ్ : కె.సి.బి. హరి
డాన్స్ : ఆజాద్ సర్ధారియా, గోకులానంద్
ఫైట్స్: డిఫరెంట్ డాని
ఆర్ట్ : వేణుగోపాల్