సంక్రాంతి సినిమాలకు బుకింగ్స్ ఓపెన్

తెలుగువారికి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటేనే విలేజ్‌లలో హడావుడి మొదలైపోతుంది. సంక్రాంతి అంటే కోడి పందాలే కాదు.. సినిమాలతో హీరోల మధ్య పోటీ కూడా జరుగుతోంది. సంక్రాంతికి సినిమాలు విడుదల చేస్తే హిట్ అవుతుందని దర్శక, నిర్మాతలు భావిస్తారు. అందుకే సంక్రాంతికి సినిమాలు విడుదల చేస్తారు. సంక్రాంతి వచ్చిందంటేనే.. నాలుగైదు సినిమాలు ఖచ్చితంగా విడుదల అవుతాయి.

advance bookings open
advance bookings open

ఈ సంక్రాంతి సందర్భంగా ఏకంగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. ఈ సినిమాలకు హైదరాబాద్‌లో ఇవాళ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. దీంతో ప్రేక్షకులు బుక్ మై షో లాంటి వెబ్‌సైట్లలోకి వెళ్లి ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రవితేజ హీరోగా వస్తున్న క్రాక్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇందులో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా.. గోపిచంద్ మాలినేని తెరకెక్కించారు. రవితేజ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక రామ్ పోతినేని హీరోగా వస్తున్న రెడ్ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఎప్పుడో ఇది విడదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది. దీనికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యయి. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న అల్లుడు అదుర్స్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా బుకింగ్స్ కూడా ఇవాళ మొదలయ్యాయి.