అడుగడుగో యాక్షన్ హీరో అంటూ వచ్చిన రూలర్ బాలకృష్ణ

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రానికి “రూలర్”. జై సింహ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ వస్తున్న ఈ సినిమాని కె.ఎస్‌.రవికుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, బాలయ్యని రెండు వేరియేషన్స్ లో చూపించి నందమూరి అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. టీజర్ లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ కి, స్టైలిష్ గా కనిపించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

టీజర్ ని మర్చిపోయే లోపు చిత్ర యూనిట్ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అడుగడుగో యాక్షన్ హీరో అంటూ సాగిన ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ హైలైట్ అయ్యాయి. లిరికల్ సాంగ్ మధ్యమధ్యలో చూపించిన విజువల్స్ లో బాలకృష్ణ చాలా కొత్తగా ఉన్నాడు. ఇంత స్టైలిష్ గా బాలయ్య ఎప్పుడూ కనిపించలేదని అంతా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సాయిచరణ్ భాస్కరుని వాయిస్ అడుగడుగో యాక్షన్ సాంగ్ కి మెయిన్ ఎస్సెట్ అయ్యాయి. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకి రానున్న రూలర్ తో బాలయ్య ఈ ఇయర్ కి హ్యాపీ ఎండింగ్ ఇస్తాడేమో చూడాలి.