ముంబై బ్లాస్ట్స్ కోసం శేష్ స్పెషల్ కేర్

adivi sesh

అడవి శేష్ హీరోగా మేజర్ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభంకానుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రోడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. అయితే ఈ చిత్రంలో నటించేందుకు అడవి శేష్.. దాదాపు 10 కిలోలకు పైగా బరువు తగ్గాడని తెలుస్తోంది. 26/11 ముంబయి దాడుల్లో ఆశువులు భాసిన మేజర్ సందీప్ ఉన్నికిషన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించున్నారు. కాగా ఈ చిత్రానికి ప్రముఖ సంభాషణల రచయిత అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు.

అలాగే ముంబయిలోని తాజ్ మహాల్ హోటల్ సెట్‌ని హైదరాబాద్ నగర శివారులో వేసిందుకు ప్రయత్నాలను ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రారంభించింది. అదేవిధంగా ఈ చిత్ర ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ తో పాటు, సినిమా సెట్ అంశాలను హీరో అడవి శేష్ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ చిత్ర షూటింగ్‌లో కొంత భాగం హైదరబాద్, ముంబయిలో చిత్రకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2020 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే విధంగా ప్రయత్నాలు ప్రారంభమైనాయి. సోని ఫిక్చర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

2008, నవంబర్ 26న ముంబయిలో తాజ్ మహాల్ హోటల్‌‌లో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఈ తోయిబా జరిపిన మారణహోమంలో నేషనల్ సెక్యూరిటీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికిష్ణన్.. ప్రాణాలు తెగించి పోరాడారు. ఆ క్రమంలో ఆయన మరణించారు. ఆయన మరణానంతరం సందీప్ ఉన్నికిష్ణన్‌కి భారత ప్రభుత్వం అశోక్ చక్రను ప్రదానం చేసింది.