లిరిక్ రైటర్స్, కంపోజర్స్ కి అండగా నిలిచిన ఆదిత్య మ్యూజిక్

ఐపిఆర్ఎస్ బోర్డు మెంబెర్ గా సౌత్ ఇండియా కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిత్య మ్యూజిక్

వివిధ భాషల్లో ఉన్న మ్యూజిక్ కంపోజర్స్, లిరిక్ రైటర్స్ కు బాసటగా ఇండియా పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ గత కొన్నేళ్లుగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 5000 మంది సంగీత కళాకారులూ, విద్వాంసులు ఈ సొసైటీలో మెంబెర్స్ గా ఉన్నారు. మ్యూజిక్ ఫీల్డ్ లో ఉన్న వారంతా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సొసైటీలో బోర్డ్ మెంబెర్ గా ఆదిత్య మ్యూజిక్ వ్యవహరిస్తోంది. సౌత్ ఇండియా నుంచి కేవలం ఆదిత్య మ్యూజిక్ కంపెనీ కి మాత్రమే ఈ అవకాశం లభించడం విశేషం. ఇక కరోనా నేపథ్యంలో ఐపిఆర్ఎస్ వారు వివిధ భాషల్లో ఉన్న తమ సభ్యులకు చేయూతగా నిలబడుతున్నారు. ఏప్రిల్, మే నెలలులో దాదాపుగా 3500 మంది మ్యూజిక్ కంపోజర్స్, లిరిక్ రైటర్స్ కి ఐపిఆర్ఎస్ ఆర్ధిక సహాయం అందించింది. ఈ రిలీఫ్ ప్యాకేజీ అవసరం ఉన్న సభ్యులుకు సంపూర్ణంగా అందించే దిశగా ఆదిత్య మ్యూజిక్ విశేషంగా కృషి చేసింది. ఈ సందర్భంగా

ఆదిత్య మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఆదిత్య గుప్త మాట్లాడుతూ

ప్రతిష్టాత్మక ఐపిఆర్ఎస్ బోర్డు మెంబెర్ గా తెలుగు రాష్ట్రలకే కాదు యావత్ సౌత్ ఇండియాకి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందం గా ఉంది. ఈ సొసైటీ లో ఉన్న మ్యూజిక్ కంపోజర్స్, లిరిక్ రైటర్స్ అందరితో ఆదిత్య మ్యూజిక్ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. వారందరికి ఐపిఆర్ఎస్ తరుపున రావాల్సిన కరోనా రిలీఫ్ ఫండ్ నూటికి నూరు శాతం వచ్చేలా కృషి చేశామని అన్నారు ఆదిత్య గుప్త. భవిష్యత్ లో సంగీత కళాకారులుకు అండగా ఉండే విధంగా ఆదిత్య మ్యూజిక్ తరుపున అన్ని రకాలుగా ఐపిఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తామని ఆదిత్య గుప్త తెలిపారు.

ప్రముఖ లిరిక్ రైటర్ శ్రీ చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ

తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఆదిత్య మ్యూజిక్ 30 ఏళ్ళుకి పైగా ఆదిత్య మ్యూజిక్ తెలుగు మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా అలరిస్తుంది. ఈ లేబిల్ ద్వారా నా పాటలు ఎన్నో బయటుకు వచ్చాయి. ఆదిత్య వారు మా పాటలని విడుదల చేయడమే కాదు మాకు ఎలాంటి విపత్తులు వచ్చిన మాకు అండగా నిలబడిన సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలోనే ప్రఖ్యాత ఐ పిఆర్ఎస్ బోర్డు మెంబర్గా అటు తెలుగుకే ఇటు యావత్ సౌత్ ఇండియా కి ప్రాతినిధ్యం వహించి కరోనా రిలీఫ్ ఫండ్ ఎందరో తెలుగు సంగీత కళాకారులకి అందేలా కృషి చేయడం చాలా అభినందనీయం. ఆదిత్య మ్యూజిక్ వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు.

ఐపిఆర్ఎస్ చైర్మన్ శ్రీ జావేద్ అక్తర్ మాట్లాడుతూ

ఈ కష్ట కాలం లో మా సొసైటీ లో ఉన్న కళాకారులకు అందించిన ఆర్ధిక సహాయం చాలా ఉపయోగ పడింది అని తెల్సింది. భవిష్యత్ లో కూడా ఇలానే ముందుకు వెళ్లాలని మా బోర్డు మెంబెర్స్ అంతా తీర్మానించుకున్నాం. లేని వారికీ ఉన్న వారు సాయం అందించాలి. సొసైటీ సభ్యులు గా ఉండి ఆర్ధికంగా ఇబ్బందులు లేని వారు, పక్క వారికీ సాయం అందించడానికి ముందుకు రావాలి అని అన్నారు.

ఐపిఆర్ఎస్ సిఈఓ శ్రీ రాకేష్ నిగమ్ మాట్లాడుతూ

కరోనా క్రైసిస్ వల్ల పనులు లేక చాలా మంది సంగీత కళాకారులూ ఇబ్బందులు పడుతున్నారు. అందులో మా సభ్యులు అనేక మంది ఉన్నారు. అందుకే ఐపిఆర్ఎస్ కు ఉన్న శక్తీ సామర్ధ్యాలు రీత్యా సభ్యులు అందరికి ఆర్థిక సహాయం అందించాము. రానున్న రోజుల్లో కూడా ఇదే పద్దతిని కొనసాగించాలని ఐపిఆర్ఎస్ బోర్డు నిర్ణయం తీసుకుంది అని అన్నారు.