‘ఆదిపురుష్’ స్టార్ట్ అయిందట

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించనున్న ‘ఆదిపురుష్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇక సీత పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ముగిసే అవకాశముంది.

adipurush

ఇది పూర్తైన తర్వాత ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన వర్క్ ఇప్పటికే మొదలైందట. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ సీన్స్ షాట్స్ ఎక్కువగా ఉంటాయని, అందుకని ఇప్పటికే ఆ వర్క్ మొదలుపెట్టారని చెబుతున్నారు. అవతార్ సినిమాకు వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేసిన టెక్నీషీయన్లే.. ఆదిపురుష్ సినిమాకు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి బట్టి చూస్తే ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉంటుందని అర్థమవుతోంది.

జనవరి నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలుపెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. మూడు నెలల్లో షూటింగ్ పూర్తి అవుతుందని చెబుతున్నారు. సంవత్సరం పాటు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. విజువల్ ఎఫెక్స్‌కు ఎక్కువ సమయం తీసుకుని అద్భుతంగా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.