రెగ్యులర్ షూటింగ్ లో ‘ఆది’ సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్!!

చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్
ఈ రోజు ప్రారంభమైంది. విజయదశమి పండుగ సందర్భంగా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్
కోకాపేట లోని ఒక ప్రవేట్ హౌస్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.


హీరో ఆది సాయికుమార్ హీరోయిన్ మిషా నారంగ్, నటుడు భూపాల్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు శివ‌శంక‌ర్ దేవ్.
క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ కథతో శివ‌శంక‌ర్ దేవ్ దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. అజ‌య్ శ్రీనివాస్ నిర్మాత. కొత్త కాన్సెప్ట్, సరికొత్త కథనం ఆది సాయికుమార్ ఇప్పటివరకు చేయని పాత్రతో సినిమా ఉంటుందని యూనిట్ చెబుతున్నారు.

న‌టీ న‌టులు – ఆదిసాయికుమార్, మిషా నారంగ్,
అలీ రాజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్న‌ప్ప‌ , వసంతి తదితరులు

సాంకేతిక వ‌ర్గం – ,

సినిమాటోగ్ర‌ఫీ ః జిశేఖ‌ర్, మ్యూజిక్: అనీష్ సోలోమాన్, పిఆర్ఒ ః జియ‌స్ కె మీడియా,
నిర్మాత ః అజ‌య్ శ్రీనివాస్
ద‌ర్శ‌కుడు ః శివ‌శంక‌ర్ దేవ్.