Tollywood: హిట్ మూవీ సీక్వెల్.. కానీ ఈ సారి విశ్వ‌క్‌సేన్‌తో కాదు వేరే హీరో!

Tollywood: న్యాచుర‌ల్ స్టార్ నాని నిర్మాణంలో తెర‌కెక్కిన చిత్రం హిట్‌.. ఇందులో విశ్వ‌క్ సేన్ హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రంలో విశ్వ‌క్‌సేన్ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా హిట్-2 చిత్రం రూపొందుతుంది. కానీ ఈ చిత్రంలో ఈ సారి విశ్వ‌క్‌సేన్ కాదు.. టాలెంట‌డ్ న‌టుడు..

అడ‌వి శేషు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. ఇక ఈTollywood చిత్రంలో కృష్ణ‌దేవ్‌గా అడ‌వి శేషు త‌న వైవిధ్య‌మైన న‌ట‌న‌ను చూపించ‌నున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ప్ర‌స్తుతం అడ‌వి శేషు మేజ‌ర్ చిత్రీక‌ర‌ణ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అనంత‌రం హిట్ సీక్వెల్ షూటింగ్‌లో పాల్గొంటున్న‌ట్టు స‌మాచారం.