‘మేజర్’ రిలీజ్ డేట్ ప్రకటించిన మహేష్ బాబు

టాలీవుడ్ హీరో అడవి శేషు ఎప్పుడూే విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. స్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న అడవి శేషు… ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ముంబై పేలుళ్లలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మేజర్’ సినిమాలో ప్రస్తుతం అడవి శేషు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఉన్నికృష్ణన్ పాత్రను అడవి శేషు పోషిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నారు.

MAJOR RELEASE DATE

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. జులై 2వ తేదీన ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మహేష్ బాబు ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక రిలీజ్ డేట్ పోస్టర్‌ను మహేష్ బాబు విడుదల చేశారు. ఇందులో ఉన్నికృష్ణన్ గెటప్‌లో అడవి శేష్ కనిపిస్తున్నాడు. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్క ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. సోనీ పిక్చర్స్ సమర్పణలో సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ , ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.