అడవి శేషు ‘మేజర్’గా వచ్చేశాడు

టాలీవుడ్ హీరో అడవి శేషు ఇవాళ తన పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడి నటిస్తున్న కొత్త సినిమా ‘మేజర్’ ఫస్ట్‌లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్ ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫస్ట్ లుక్‌లో అడవిశేష్‌ సీరియస్‌ లుక్‌లో, ఓ ఆపరేషన్‌ చేపడుతున్నట్టుగా ఉన్నాడు. అలాగే చేతిలో గన్‌ పట్టుకుని ఉన్నాడు. చూడటానికి ఈ లుక్ చాలా బాగుంది.

ADAVI SESHU

26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రానుంది. ‘గూఢాచారి’ సినిమాను తెరకెక్కించిన శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ అయిన మహేష్ బాబు ఎంటర్‌టైన్ మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను 2021 సమ్మర్‌లో విడుదల చేయనున్నారు.

ఈ ఫస్ట్‌లుక్‌ను మహేష్ బాబు తన ట్విట్టర్‌లో విడుదల చేశాడు. ఈ సందర్భంగా మేజర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నాడు. ఈ సందర్భంగా అడవి శేషుకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్పాడు. ఈ సినిమాలో అడవి శేషు నటన మరోసారి ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నానని, ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని మహేష్ తెలిపాడు.