బాలీవుడ్ లో కంగనాకి క్వీన్ గా మంచి గుర్తింపు ఉంది. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల కంగనా, కాంట్రవర్సిల్లో కూడా అదే రేంజులో ఇరుక్కుంటూ ఉంటుంది. కంగనా కావాలని పెట్టుకుంటుందో లేక అవి అలా జరిగిపోతూ ఉంటాయో తెలియదు కానీ ఆమె ఉన్న చోట కాంట్రవర్సి తప్పకుండా ఉంటుంది. కంగనాకు తోడు, రంగోలి కూడా కావాలడంతో వివాదాలు తెచ్చి పెట్టె రేంజులో ఇతరులపై విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడూ టైం మనదే కాదు కదా, అప్పుడప్పుడూ ఎదుటి వాళ్లది కూడా అవుతుంది.
రీసెంట్ గా కంగనా, ఆమె సిస్టర్ రంగోలిలు తాప్సి గురించి కామెంట్స్ చేశారు. తాప్సి చాలా చీప్… తక్కువ పారితోషికం తీసుకుంటుంది, ప్రతి విషయంలో కంగనాని ఫాలో అవుతుందని రంగోలి విమర్శించింది. రంగోలి, తాప్సి గురించి మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు, గతంలో చాలా సార్లు ఆమె తాప్సిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. అప్పుడప్పుడూ రంగోలి కామెంట్స్ కి కౌంటర్లు వేసే తాప్సి, తాజాగా నేహా చేస్తున్న రేడియో షోకి గెస్ట్ గా వెళ్ళింది. ఈ సందర్భంగా కంగనా, రంగోలీపై సైలెంట్ పంచులు వేసిన తాప్సి, “వారిద్దరికి నేనంటే చాలా ప్రేమ, వారు నన్ను ప్రేమించినంతగా నేను వారిని ప్రేమించలేకపోతున్నాను.. నా గురించి వారు ఎక్కువగా సమయం కేటాయిస్తూ, నా గురించే ఆలోచిస్తుంటారు.. వారికి నిజంగానే నేనంటే ఎంతో ప్రేమ, కానీ నేనే వారిపై ప్రేమని చూపించలేకపోతున్నాను, నాకు అంత టైం ఉండట్లేదు” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. మరి ఎప్పుడూ ఒక కామెంట్ ముందే చేసే రంగోలి, కంగనాలు తాప్సి కౌంటర్లకి ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం.