మంచున తడిసిన ముత్యం

కేరళ సినీ అభిమానులకి మలర్ గా, తెలుగు సినీ అభిమానులకి భానుమతిగా పరిచయమైన అమ్మాయి సాయి పల్లవి. క్యూట్ అండ్ నేచురల్ యాక్టింగ్ తో అందరినీ మెప్పించే సాయి పల్లవి స్క్రీన్ పైన కనిపిస్తే, ఆమె నుంచి కళ్లు తిప్పుకోవడం కష్టమే. అంత బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న సాయి పల్లవి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు కానీ అప్పుడప్పుడూ పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే అవన్నీ ప్రకృతి గురించో ఫామిలీ గురించో కావడం విశేషం. ఎన్విరాన్మెంట్ లవర్ అయిన సాయి పల్లవి రీసెంట్ గా ఇన్స్టాలో తన లేటెస్ట్ ఫొటోస్ ని షేర్ చేసింది. చుట్టూ చెట్లు మధ్యలో పటియాలా వేసుకోని కూర్చున్న సాయి పల్లవి ‘Zephyr’ అని కామెంట్ చేసింది. ‘Zephyr’ అంటే సాఫ్ట్ డ్రిజిల్ అని అర్ధం.

View this post on Instagram

Zephyr

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on

ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి రానా యాక్ట్ చేస్తున్న విరాటపర్వం కాగా మరొకటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ కరోనా బ్రేక్ తర్వాత ఇటీవలే మళ్లీ మొదలయ్యింది. ఈ రెండు కాకుండా సాయి పల్లవికి నాని నటించనున్న శ్యామ్ సింగరాయ సినిమాలో కూడా ఆఫర్ వచ్చిందని, దాదాపు 2 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా మేకర్స్ రెడీగా ఉన్నారని సమాచారం. మరి మిడిల్ క్లాస్ అబ్బాయి కాంబినేషన్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.