జబర్దస్త్ యాంకర్ నటి ”రష్మిగౌతమ్” ప్రారంభించిన థ్రెడ్ & ఫ్యాబ్రిక్స్ స్టూడియో !!

కె.పి.హెచ్.బి కాలనీలో నటి జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సందడి

నటి జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కి పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్న డిజైనర్ దివ్య ఏర్పాటు చేసిన…త్రెడ్ అండ్ ఫ్యాబ్రిక్ డిజైనర్ స్టూడియోను రష్మీ గౌతమ్ ప్రారంభించింది.ఈ సందర్భంగా

జబర్దస్త్ యాంకర్ నటి రష్మీ గౌతమ్ మాట్లాడుతూ …దివ్య మంచి ఔట్ లుక్ డిజైన్స్ అందిస్తుంది.తను నాకెంతో ఇష్టమైన డిజైన్స్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. ఎంతో శ్రద్ద పెట్టి డెడికేషన్ తో పని చేస్తుంది.అలాగే ఈ మధ్య మహిళలు ఎక్కువగా వాకిన్ స్టోర్లను ఆదరిస్తున్నందున తన మనసులో ఉన్న కోరికకు నా.. మాటలు తోడు అవ్వడంతో ఈ వాకిన్ స్టోర్ ప్రారంభించడం జరిగింది.అలాగే తను తయారు చేసే చాక్లెట్ నాకు ఎంతో నచ్చాయి.తను త్వరలో చాక్లెట్ స్టోర్ ప్రారంభింస్తానంటే నా సహకారం ఉంటుంది.కాబట్టి ఆమెను అందరూ ఆదరించాలని తను ఈ స్టూడియో తో పాటు సిటీ లో మరిన్ని బ్రాంచ్ లు ఓపెన్ చేస్తే వాటికి నేనె గెస్ట్ గా వస్తానని అన్నారు.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ దివ్య మాట్లాడుతూ …రష్మి గౌతమ్ గారి సహకారం మరిచిపోలేనిది.రెండు సంవత్సరాలు గా తను చేసే డీ,జబర్దస్త్ ప్రోగ్రామ్స్ కు నేను ఫ్యాషన్ డిజైనర్ గా చేయడం ఏంతో హ్యాపీ గా ఉంది.రష్మీ గౌతమ్ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా తొందరగా రిలీజ్ అయ్యి మంచి హిట్టు కొట్టాలి.
చాలామంది ఆన్ లైన్ లో ఫ్యాబ్రిక్స్ కొని మోసపు తున్నామని నా దృష్టికి తీసుకు రావడం తో నాకు ఫిజికల్ స్టోర్ పెట్టాలనే పట్టుదలతో స్టోర్ పెట్టడమే నా డ్రీమ్ అనుకున్నాను.నేను రెండు సంవత్సరాలనుండి అనుకుంటున్న నా కోరిక ఈ లాక్ డౌన్ తో మరింత డిలే అయ్యింది.నేను అనుకున్న డ్రీమ్ ఈ రోజు కె.పి.హెచ్.బి లో నేను ఓపెన్ చేసిన థ్రెడ్ & ఫ్యాబ్రిక్స్ స్టూడియో తో తీరింది. రష్మీ గౌతమ్ గారు వచ్చి నా స్టూడియో ప్రారంభించిన ఆమెకు నా ధన్యవాదాలు.అలాగే నేను తయారు చేసే హోమ్ మేడ్ చాక్ లెట్స్ లలో మ్యారీ గోల్డ్ చాక్లెట్ తనకు ఎంతో ఇష్టం.కష్ట పడే వారు అంటే రశ్మి గౌతమ్ కు ఏంతో ఇష్టం.
అందుకే ఆమె సపోర్ట్ తో చాక్లెట్స్ స్టోర్ ఓపెన్ చేస్తాను. ఈ సారి సంక్రాంతి పండుగ తన సొంత ఊరు వైజాగ్ లో జరుపుకుంటానని ,అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.