బాలయ్య హీరోయిన్ భలే హాట్ గురు…

కంచే సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించన హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్. మొదటి సినిమాలో చాలా ట్రెడిషనల్ గా కనిపించి తన యాక్టింగ్ తో మెప్పించిన ప్రగ్యా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ. నందమూరి నటసింహం బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో సినిమాపై తెలుగు సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. గత కొంత కాలంగా అవకాశాలు లేక తెరపై కనిపించిన ప్రగ్యాకి అఖండ కంబాక్ మూవీ అయ్యే అవకాశం ఉంది.

సినిమాలు లేక ప్రగ్యా కెరీర్ కాస్త డల్ అయిన మాట నిజమే అయినా అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం సెగలు పుట్టిస్తుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి డీసెంట్ గా గానే కనిపించిన ప్రగ్యా, ఇన్స్టాలో మాత్రం హీట్ వేవ్స్ జనరేట్ చేసే పోస్టులు పెడుతుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్స్ తో ఫాన్స్ కి కిక్ ఇస్తున్న ఈ హీరోయిన్, తాజాగా బెడ్ పై పడుకోని బికినీలో హాట్ ఫొటోస్ దిగి వాటిని షేర్ చేసింది. ఇప్పటివరకూ ప్రగ్యాని ఇంత హాట్ గా ఎవరూ చూసి ఉండరు. ప్రగ్యా గ్లామర్ కి అఖండ హిట్ రిజల్ట్ కూడా తోడైతే, కెరీర్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్లే.