నటి కృష్ణవేణి కన్నుమూత

అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూశారు. వయోభారంతో HYD ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పంగిడిలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. ‘సతీ అనసూయ’ సినిమాతో సినీ అరంగేట్రం చేశారు. 1940లో మీర్జాపురం రాజా (మేకా రంగయ్య)తో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె నిర్మాతగానూ మారారు. ‘మనదేశం’ సినిమాతో NTRను చిత్రరంగానికి పరిచయం చేశారు.