మణికొండలో “గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్” ప్రారంభించిన ప్రముఖ నటి హిమజ

ప్రముఖ నటి హిమజ మణికొండలో “గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్” ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్స్ యమున, విజయ్ తో పాటు ఏపీ, తెలంగాణ గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ హరికృష్ణ పాల్గొన్నారు. గ్రీన్ ట్రెండ్స్ బ్రాండ్ వ్యాల్యూ, క్వాలిటీ మేకోవర్ ను మణికొండ వాసులకు ఈ ఫ్రాంఛైజీ అందించబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో హెయిర్ అండ్ స్టైలింగ్ ఇక్కడ అందుబాటులో ఉండనుంది. మణికొండలో గ్రీన్ ట్రెండ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో

గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ హరికృష్ణ మాట్లాడుతూ – దేశవ్యాప్తంగా గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీలు బాగా రన్ అవుతున్నాయి. తెలంగాణ, ఏపీలో దాదాపు వంద వరకు మా ఫ్రాంఛైజీలు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ ట్రెంట్స్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా యమున, విజయ్ గారు ప్రారంభంలోనే విజయం సాధించినట్లు. హిమజ గారిది లక్కీ హ్యాండ్. ఆమె చేతుల మీదుగా మణికొండ ఫ్రాంఛైజీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. అన్నారు.

మణికొండ గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్ యమున మాట్లాడుతూ – మా గ్రీన్ ట్రెండ్స్ బ్రాంచ్ ను మణికొండలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ రోజు మా ఫ్రాంఛైజీ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చిన హిమజ గారికి థ్యాంక్స్. మేము ఎన్నో కంపెనీస్ చూశాము. కానీ గ్రీన్ ట్రెండ్స్ మాకు బాగా నచ్చింది. వారు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి విషయంలోనూ అందుబాటులో ఉన్నారు. మా గ్రీన్ ట్రెండ్స్ కు వచ్చేవారికి కంప్లీట్ మేకోవర్ హై క్వాలిటీతో ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం. అన్నారు.

మణికొండ గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్ విజయ్ మాట్లాడుతూ – ఈ రోజు మా ఫ్రాంఛైజీ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చిన హిమజ గారికి కృతజ్ఞతలు. ఆమెది మంచి హ్యాండ్. గ్రీన్ ట్రెండ్స్ ఎంత ప్రసిద్ధి చెందిందో మీకు తెలుసు. ఇక్కడ మణికొండ వాసులకు మా ఫ్రాంఛైజీ ద్వారా గ్రీన్ ట్రెండ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. గ్రీన్ ట్రెండ్స్ సంస్థ మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నారు. వారికి థ్యాంక్స్ చెబుతున్నాం. మా గ్రీన్ ట్రెండ్స్ కు వచ్చిన వారు అందంగా ముస్తాభై, చాలా సంతోషంగా తిరిగి వెళ్తారు. అన్నారు.

నటి హిమజ మాట్లాడుతూ – గ్రీన్ ట్రెండ్స్ గురించి నేను చెప్పాల్సిన పనిలేదు. ఇండియా మొత్తం బ్రాంచీలు ఉన్నాయి. ఇప్పుడున్న సొసైటీలో అందంగా కనిపించేందుకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదైనా చిన్న కార్యక్రమం ఉన్నా హెయిర్ నుంచి ప్రతి విషయంలో అందంగా ముస్తాభై వెళ్తున్నారు. అలాంటి మీకు గ్రీన్ ట్రెండ్స్ ది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ హెయిర్, స్టైల్, మేకోవర్ చేసుకున్నాక నన్ను నేనే నమ్మలేనంత అందంగా తయారయ్యాను. మీరు కూడా గ్రీన్ ట్రెండ్స్ లో మీకు నచ్చినట్లు మేకోవర్ కావొచ్చు. యమున, విజయ్ గారు గ్రీన్ ట్రెండ్స్ సెలెక్ట్ చేసుకోవడంలోనే సక్సెస్ అయ్యారు. వారికి మరింతగా ఈ ఫ్రాంఛైజీ విజయాన్ని అందించాలని కోరుతున్నా. అన్నారు.