కాస్టింగ్ కౌచ్ అనేది హిందీ చిత్ర పరిశ్రమలో ఏ స్థాయిలో ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో కంటే ఎక్కువగా కొన్ని ఘటనలకు సంబంధించిన నిజాలు బయటకు వస్తున్నాయి. ఎంతో మంది నటీమణులు లైంగిక వేధింపులకు గురయినట్లు బయటపెట్టారు. దంగల్ యాక్టర్ ఫాతిమా సనా షేక్ ఇటీవల తన మూడేళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించాడు.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఘోర సంఘటనను గుర్తుచేసుకుంది. ఆమె మాట్లాడుతూ, “నాకు కేవలం మూడేళ్ళ వయసులో నేను వేధింపులకు గురయ్యాను. మొత్తం లైంగిక వేధింపుల సమస్య చుట్టూ ఒక కళంకం ఉంది, అందుకే మహిళలు జీవితంలో అలాంటి విషయాలను బయటపెట్టడం లేదు. ఈ రోజుల్లో ప్రపంచం మారిపోతుందని నేను ఆశిస్తున్నాను. దీని గురించి మరింత అవగాహన మరియు విద్య అవసరం. కొన్ని సందర్భాల్లో నేను కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నాను. అవకశాలు రావాలి అంటే వాళ్ళు అడిగిన దానికి.ఒప్పుకోవాలి అనే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ మనం ధైర్యంగా ఉండి అలాంటి వాటిని ఎదుర్కోవాలి.. అని ఫాతిమా వివరణ ఇచ్చారు.