


పలు హిట్ చిత్రాలతో పాటు, టీవీ కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి, వ్యాఖ్యాత అనితా చౌదరి రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలో “మగ్ స్టోరీస్ కేఫే అండ్ కిచెన్” ఏర్పాటు చేశారు. “మగ్ స్టోరీస్ కేఫే అండ్ కిచెన్” ను ప్రముఖ యువ హీరో నిఖిల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణి మాలిక్ గారు , నటుడు ఉత్తేజ్ గారు , నటి శ్రీలక్ష్ గారు , ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దాము గారు , ప్రొడ్యూసర్ స్రవంతి రవికిషోర్ గారు , రచయిత బీవీఎస్ఎన్ రవి గారు , నటుడు రఘుబాబు గారు , డైరెక్టర్ నందినీ రెడ్డి గారు, ఇలా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా


నటి అనితా చౌదరి మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నటిగా, వ్యాఖ్యాతగా నేను మీ అందరి ప్రేమను పొందగలగడం సంతోషంగా ఉంది. ఇప్పుడు మగ్ స్టోరీస్ కేఫే అండ్ కిచెన్ ను ఏర్పాటు చేశాను. ఇలాంటి ఒక కెఫే పెట్టాలనేది నా డ్రీమ్, చెప్పడమే తడువు మా మగ్ స్టోరీస్ కేఫ్ ప్రారంభించడానికి హీరో నిఖిల్ గారు తనకున్న ఎంతో బిజీ షెడ్యూల్స్ ని పక్కన పెట్టి తన విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇండస్ట్రీలోని ఎంతోమంది స్నేహితులు మరియు ప్రముఖులు నన్ను సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం గా ఉంది. హైదరాబాద్ అంటేనే మొదటిగా గుర్తు వచ్చేది ఫుడ్ , అలాంటి మా లవర్స్ కోసం మగ్ స్టోరీస్ మీకు వెల్ కమ్ చెబుతోంది. ఆహ్లాకరమైన వాతావరణంలో కాఫీతో పాటు ఎన్నో కబుర్లు చెప్పుకునేందుకు మా మగ్ స్టోరీస్ మీకోసం వెయిట్ చేస్తోంది. మరీ ముఖ్యం గా మా ఈ చిరు ప్రయత్నానికి ఎంతో సపోర్ట్ చేసి అండగా నిలబడిన వైల్డ్ వింగ్స్ అధినేత శ్రీ బాలు దూడెం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం” అన్నారు. “మీరంతా నా ప్రయత్నాన్ని సపోర్ట్ చేసి మీ సజెషన్స్ ఇస్తారని కోరుకుంటున్నాం” అన్నారు.