బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమి

‘ఐ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమీ జాక్సన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎవడు చిత్రంలో నటించడం జరిగింది. అతడికి ‘ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్విక్’ అని పేరు పెట్టారు. తన భర్త-బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్ విక్, కొడుకుతో కలిసి దిగిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2022 నుంచి వెస్ట్విక్ తో డేటింగ్ చేసిన అమీ గతేడాది పెళ్లి చేసుకున్నారు.అంతకుముందు మాజీ భర్త జార్జ్ ఆమె ఓ కొడుకును కన్నారు. 2021లో అమీ, జార్జ్ విడిపోయారు.