మాస్ కా దాస్ క్లాస్ గా మారాడు కానీ…

ఏమైంది ఈ నగరానికి సినిమాతో యూత్ కి కనెక్ట్ అయ్యి, ఫలకనామ దాస్ గా ఆడియన్స్ ముందుకి వచ్చి సోలో హీరోగా సెట్ అయిపోయిన హీరో విశ్వక్ సేన్. మాస్ కా దాస్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ఈ యంగ్ హీరో హిట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. స్టైల్, యాటిట్యూడ్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన విశ్వక్ సేన్, బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ఇచ్చి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్దమయ్యాడు.

ఎప్పుడూ మాస్ గా కనిపించే విశ్వక్ సేన్, ప్యూర్ క్లాస్ గా కనిపిస్తూ నటించనున్న సినిమా పాగల్. డెబ్యూ డైరెక్టర్ నరేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎప్పుడో లాంచ్ అయ్యింది కానీ కరోనా కారణంగా రెగ్యులర్ షూటింగ్ ఆగిపోయింది. అన్ లాక్ ఫేజ్ స్టార్ట్ అవ్వడంతో పాగల్ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ విశ్వక్ సేన్ ట్విట్టర్ లో ఒక ఫోటో పోస్ట్ చేశాడు. తన లుక్ పూర్తిగా మార్చి విశ్వక్ సేన్ కొత్తగా కనిపించాడు. క్లాస్ గా పర్ఫెక్ట్ క్లాస్ లుక్ లో విశ్వక్, తనలో మాస్ మాత్రం అలానే ఉందనే హింట్ ఇస్తూ నోట్లో బీడీని అలానే ఉంచాడు. మరి ఇప్పటివరకూ మాస్ ని టార్గెట్ చేసిన విశ్వక్ సేన్, ఈ మూవీతో క్లాస్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేస్తాడేమో చూడాలి.