సూర్య సినిమాకి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం ఇది…

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఆకాశం నీ హద్దురా. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2020 నవంబర్ లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి మంచి వ్యూస్ తో పాటు కాంప్లిమెంట్స్ కూడా అందుకుంది. ఎయిర్ డెక్కన్ సంస్థ అధినేత గోపినాథ్ కథతో తెరకెక్కిన సూరారై పోట్రు, 93వ ఆస్కార్ అవార్డలకు ఇండియా నుంచి నామినేషన్స్ లిస్ట్ లో స్థానం సంపాదించుకోని అరుదైన గౌరవం దక్కించుకుంది. ఇక్కడితో ఆగని ఈ సినిమా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. చైనాలోని ప్రధాన నగరం షాంఘైలో జరిగిన అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఈ సినిమా ఎంపికైంది. భారత్ నుంచి ఈ ఫెస్టివల్‌కు మూడు సినిమాలు ఎంపిక కాగా.. దక్షిణాది ఇండస్ట్రీల నుంచి ఎంపికైన ఏకైన సినిమాగా సూరరై పోట్రు నిలిచింది. ఈ విషయాన్ని రాజశేఖర్ పాండియన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ప్రైజ్‌ ది బ్రేవ్’ పేరుతో ఈ సినిమా షాంఘై ఫిలిమ్ ఫెస్టివల్‌లో పానరోమా విభాగంలో ప్రదర్శితమవుతుందని ఆయన ట్వీట్ చేశారు.

ఇది మాత్రమే కాకుండా సూరారై పోట్రూ మూవీ వరల్డ్ లోనే టాప్ రేటెడ్ సినిమాల్లో మూడో స్థానం సంపాదించుకుంది. ఐఎండిబి ఇచ్చిన రేటింగ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ది శశాంక్ రిడంషన్ ఉండగా సెకండ్ ప్లేస్ లో గాడ్ ఫాదర్ ఉంది. ఇప్పుడు మూడో ప్లేస్ లో సూర్య సూరారై పోట్రూ దక్కించుకుంది. ఓటీటీలో రిలీజ్ అయ్యి ఇంత పేరు తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్స్ లో కూడా వచ్చి ఉంటే కలెక్షన్స్ కూడా అంతే బాగా వచ్చేవి. మంచి సినిమా ఎక్కడ విడుదల అయినా గుర్తింపు వస్తుంది అనడానికి ఇదో ఉదాహరణ.