సుమన్ ‘బందిపోటు’కు 33 ఏళ్లు

సీనియర్ హీరో సుమన్ నటించిన ‘బందిపోటు’ మూవీ 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. తెలుగు తెరపై హీరోగా పలు చిత్రాల్లో నటించి విజయాలు అందుకున్న సీనియర్ హీరో సుమన్ నటించిన యాక్షన్ మూవీ ‘బందిపోటు’. అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్‌పై కాట్రగడ్డ ప్రసాద్ సమర్పణలో టీఆర్ తులసి ఈ చిత్రాన్ని నిర్మించారు. బి.ఎల్వీ. ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘బందిపోటు’ చిత్రం 1988 ఆగస్టు 4న విడుదలైంది. గౌతమి, కల్పన, పూర్ణిమ, శివకృష్ణ, కోటాశ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, సుత్తి వీరభద్రరావు, రంగనాథ్, నర్రా వేంకటేశ్వరరావు, డిస్కో శాంతి, చంద్రిక, మోహన్ కుమార్, వినోద్, ఓంకార్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాజ్-కోటి సంగీతం అందించారు. వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం అందించిన ఈ చిత్రం పాటలు హిట్‌గా నిలిచి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ చిత్రంతో సుమన్‌కు కూడా హీరోగా మంచి పేరు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ముహూర్తం షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చి విష్ చేయడం విశేషం.

ఈ సందర్బంగా హీరో సుమన్ మాట్లాడుతూ .. ఈ రోజు చాలా స్పెషల్ డె.. 33 సంవత్సరాలకు ముందు ఈ రోజు బందిపోటు సినిమా విడుదలైంది. అప్పట్లో ఆ సినిమా పెద్ద హిట్టయింది. ఆ ఈ సినిమాతో నా కెరీర్ మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రసాద్ గారికి కూడా మళ్ళీ కెరీర్ స్టార్ట్ అయింది. గ్రేట్ టెక్నీషియన్స్ చేసిన సినిమా ఇది. కాట్రగడ్డ ప్రసాద్ గారి నిర్మాణంలో బి. ఎల్వి. ప్రసాద్ గారి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా గట్టి పోటీ మధ్య విడుదలై పెద్ద విజయం అందుకోవడం మరచిపోలేని అనుభూతి. చాలా రోజుల తరువాత గుర్తొచ్చింది. నాతొ హీరోయిన్ గా గౌతమి గారు మొదటి సారి నటించారు. ఈ సినిమా టి ఎల్ వి ప్రసాద్ గారు గ్రేట్ డైరెక్టర్ చాలా టెక్నీకల్ గా చేసారు. నిజంగా ప్రసాద్ గారికి హ్యాట్సాఫ్ చెప్పాలి. చాలా ధైర్యం చేసి నాతొ సినిమా చేసారు. ఈ సినిమా నాకు సెకండ్ ఇన్నింగ్ అని చెప్పాలి. ఈ సినిమా తరువాత నేను వరుసగా అవకాశాలు అందుకున్నాను. ఈ సినిమా ఓపెనింగ్ కు చిరంజీవి గారు వచ్చి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ అందరికి మరోసారి థాంక్స్ చెబుతున్నాను అన్నారు.