సినీ నటుడు, బిగ్ బాస్ మొదటి సీజన్ విజేత శివ బాలాజీ చాలా రోజుల తరువాత మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ప్రయివేట్ పాఠశాల యాజమాన్యాల వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమయ్యాను అంటూ సరికొత్త దారిలో నడుస్తున్నాడు. కరోనా కష్ట కాలంలో బ్రతకడమే బరువైన వేళ సామాన్య ప్రజల పిల్లల్ని ప్రయివేటు విద్యా సంస్థలు దోచుకోవడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు.
మొదట శివబాలాజీ వారి పిల్లల యొక్క స్కూల్ యాజమాన్యం ఆన్లైన్ క్లాసుల పేరుతో భారీగా డబ్బులు గుంజడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం వారు నెమ్మదించడంతో ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకు తాను అండగా ఉండబోతున్నట్లు శివబాలాజీ ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సమావేశంలో వివరణ ఇచ్చారు. కరోనా కష్ట కాలంలో ఉపాధి లేక సతమతమవుతున్న వారి నుంచి అధిక ఫీజులు తీసుకునే వారి పని పట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన శివబాలాజీ ప్రస్తుతం తనకు వేరే పనిలేదని పిల్లల్ని వేధిస్తే మీ పని పడతానని కూడా అన్నారు