దర్శకుడు నంద్యాల రవికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించిన నటుడు సప్తగిరి !!

రచయిత నంద్యాల రవి కోవిడ్ తో బాధపడుతున్నారు. ఇప్పుడిప్పుడే సీరియస్ కండిషన్ నుంచి తేరుకుంటున్నాడు. తన పూర్తి హాస్పిటల్ బిల్లు ఆరేడు లక్షల బిల్లు చెల్లించాల్సి వుంది. నంద్యాల రవి కుటుంభానికి అంతటి స్తోమత లేదు.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నంద్యాల రవికి ఆర్థిక సాయం ఎంతో అవసరం. ఈ సమయంలో నటుడు సప్తగిరి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. తన వంతుగా 1 లక్ష రూపాయల సాయం నంద్యాల రవి అందించడం జరిగింది.