సీనియర్ కమెడియన్ పృథ్వి తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ లో చేరారు. గత కొంత కాలంగా జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఒక ప్రయివేటు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. కోవిడ్ పరీక్షల్లో చాలా వరకు నెగిటివ్ అనే వచ్చిందని పృథ్వి తెలిపారు.
ఒక వీడియో విడుదల చేస్తూ వివరణ ఇచ్చిన పృథ్వి గత రాత్రి అనారోగ్య కారణంగా హాస్పిటల్ లో చేరినట్లు వివరణ ఇచ్చాడు. ఇక కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని వచ్చినప్పటికీ వైద్యుల సమక్షంలోనే 15రోజుల పాటు ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన ఆయన త్వరలోనే కోలుకొని మీ ముందుకి వస్తానని అన్నారు. ఇక తనపై అభిమానులు ఆశీర్వాదం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు పృథ్వి ఆశాభావం వ్యక్తం చేశారు.