తన కల నెరవేరింది అంటున్న నటుడు ప్రవీణ్

తెలుగు సినిమా ఇండస్ట్రి లొ ఈ త‌రం న‌టులు, ద‌ర్శ‌కులు, టెక్నిషియ‌న్స్ లొ చాలా శాతం మంది అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి అన‌టం లొ అతిశ‌యెక్తి లేదు. దిల్ రాజు నిర్మించిన కొత్త‌బంగారులొకం చిత్రం నుండి కొత్త టాలెంట్ ఆర్టిస్ట్ గా ప్ర‌వీణ్ త‌న న‌ట జీవితాన్ని మెద‌లుపెట్టారు.. ఆ చిత్రం త‌రువాత చాలా చిత్రాల్లొ గొదారి స్లాంగ్ తొ కామెడి చేసి తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు. ద‌ర్శ‌కుడు మారుతి దర్శ‌క‌త్వం లొ ప్రేమ క‌థా చిత్ర‌మ్ లొ మ‌రొక్క సారి ప్రేక్ష‌కుల్ని త‌న న‌ట‌న‌తొ త‌న టైమింగ్ కామెడి తొ న‌వ్వించాడు. అంతేకాదు దాదాపు ప్ర‌తి చిత్రం విభిన్న పాత్ర‌లు చేసి ప్రేక్ష‌కుల్ని మెప్పించాడు. ప్ర‌వీణ్ స్వ‌త‌హాగా మెగాస్టార్ అభిమాని, కాని మెగాస్టార్ తో ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య లో నటించిన ఆశించినంత స్కీన్ స్పేస్ రాలేదు.. ఎవరు ఊహించని విధంగా విశ్వంభ‌ర చిత్రం లో .. దాదాపు మెగాస్టార్ తొ ఎక్కువ స్కీన్ స్పేస్ పంచుకుని అవకాశం దక్కింది. దానికి ప్ర‌వీణ్ ఆనందానికి అవ‌ధులు లేవు. అంతేకాదు మెగాస్టార్ తొ త‌న అభిమాన ముచ్చ‌ట్లు షాట్ గ్యాప్ లొ పంచుకున్నాడ‌ని ఆయ‌న‌తొ యాక్ట్ చేయ‌డం అంటే అది త‌న అదృష్టం గా భావిస్తున్నాన‌ని తెలిపాడు. కేవ‌లం న‌టించే అవ‌కాశమే కాదు ఆయ‌న‌తొ కామెడి చేసే ఛాన్స్ వ‌చ్చింద‌ని రేపు ధియోట‌ర్స్ ఆ కామెడి చూసి ప్రేక్ష‌కులు న‌వ్వుకుంటార‌ని తెలిపాడు.