
టాలీవుడ్ లొ నటులు సినిమా తరువాత ఎక్కువ ఇంట్రస్ట్ చూపించే బిజినెస్ ఫుడ్ బిజినెస్.. రెస్టారెంట్ లు.. హోటల్స్ ఇలా ఎంటర్ అవుతున్నారు. గతంలొ సందీప్ కిషన్ వివాహ భొజనంభు అంటూ సక్సస్‌ఫుల్ గా రెస్టారెంట్ నడుపుతున్నారు. అలాగే హీరో నాగశౌర్య కూడా ఐరా రెస్టారెంట్ అని స్టార్ట్ చేశారు. సత్యం రాజేష్ కూడా బాబాయ్ హోటల్ నడుపుతున్నాడు.. గతం లొ హెల్తి ఫుడ్స్ అని సమంత కూడా మాదాపూర్ లొ ఒక అవుట్ లెట్ ని నడిపింది. అయితే ఈ జాబితాలొకి తాజాగా నటుడు ప్రవీణ్ చేరాడనే చెప్పాలి.. కొత్త బంగారు లొకం చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయం అయ్యి ప్రేమకథా చిత్రం ద్వారా నటుడుగా తెలుగువారికి అందులొను గొదావరి జిల్లాల్లొ ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు.. తాజాగా సోషల్ మీడియాలొ బకాసురా రెస్టారెంట్ పేరు మీద ఒక రెస్టారెంట్ ని ప్రవీణ్ ప్రారంభిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.. గొదారొళ్ళకి వెటకారం ఎక్కువని ఈ రెస్టారెంట్ పేరుత మరోక్క సారి ప్రూవ్ అయ్యింది. మంచి భొజనాలతొ పాటు గొదారి మర్యాద, కొంచెం వెటకారం కూడా ఇక్కడ స్పేషల్ అని తెలుస్తుంది.