యాడ్ షూట్ లో అదరగొట్టిన నితిన్.. వైరల్ లుక్

యువ హీరో నితిన్ ఈ ఏడాది మొత్తానికి భీష్మ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. అలాగే తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేశాడు. ఇక కరోనా లాక్ డౌన్ గోల లేకపోయి ఉంటే వరుసగా ఈపాటికే రంగ్ దే సినిమాను రిలీజ్ చేసేవాడు. అలాగే అందాదున్ కూడా సెట్స్ పైకి వచ్చి ఉండేది. కానీ కరోనా రావడం వలన నితిన్ ప్లాన్స్ తారుమారయ్యాయి.

అసలు మ్యాటర్ లోకి వస్తే నితిన్ ఎండోర్స్‌మెంట్ ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునేందుకు రెడీ అయ్యాడు
ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు పలు ఉత్పత్తులకు సంబంధించి ప్రకటనల్లో నటిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇక నితిన్ కూడా యాడ్స్ లలో సరికొత్తగా కనిపిస్తూ తన ఆదాయాన్ని పెంచుకునే విధంగా అడుగులు వేస్తున్నాడు. ఇక నెక్స్ట్ మెర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయనున్న అందాదున్ రీమేక్ షూటింగ్ ని డిసెంబర్ లో స్టార్ట్ చేయాలని ఈ యువ హీరో ప్లాన్ చేసుకుంటున్నాడు. అలాగే కొత్త మరో రెండు కొత్త కథలను కూడా నితిన్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంచినట్లు సమాచారం.