
సినీ నటుడు మంచు మనోజ్ జల్లికట్టుపై స్పందించడం జరిగింది. ఏ. రంగంపేటలో సుమారు బ్రిటిష్ కాలం నుండి జల్లికట్టును నిర్వహిస్తున్నారు. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు గత 20 సంవత్సరాలుగా జల్లికట్టును నిర్వహించడం జరుగుతుంది. దీనిని ప్రజలంతా ఎంతో ఆనందకరంగా పార్టీలకు, కులాలకు అతీతంగా జరుపుకుంటారు. దీనిలో పాల్గొనే ఉత్సాహవంతమైన యువకులంతా పోలీసు వారికి సహకరిస్తూ శాంతి భద్రతలను కాపాడుతూ జల్లికట్టులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను అన్నారు.