టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సెట్ చేసుకున్న తమిళ నటులలో కార్తీ ఒకరు. అన్నయ్య సూర్య తరహాలో హీరోగా మంచి క్రేజ్ అందుకుంటున్న కార్తీ చాలా రోజుల తరువాత ఒక గుడ్ న్యూస్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. తమ ఇంట్లో మరో సభ్యుడు చేరినట్లు సోషల్ మీడియా ద్వారా గుడ్ న్యూస్ అందించాడు.
కార్తీ భార్య మరో మగ బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన కార్తీ.. నాకు మగపిల్లవాడు పుట్టాడు. జీవితాన్ని మార్చే అనుభవం ద్వారా మమ్మల్ని తీసుకెళ్లినందుకు వైద్యులు, నర్సులకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. నవజాత శిశువుకు మీ అందరి బ్లేస్సింగ్స్ కావాలి. ధన్యవాదాలు.. అంటూ కార్తీ వివరణ ఇచ్చారు ప్రస్తుతం ‘సుల్తాన్’, పొన్నీ సెల్వన్ వంటి చిత్రాల్లో నటిస్తున్న కార్తీ త్వరలోనే తెలుగులో కూడా ఒక డైరెక్ట్ మూవీ చేయనున్నట్లు సమాచారం