రాజకీయాలకు వైసీపీకి గుడ్ బై చెప్పిన నటుడు అలీ

నటుడు అలీ చిన్న వయస్సు నుండి చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలో నటిస్తుం వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటన ముగిసిన తరువాత దగ్గుబాటి రామానాయుడు గారు తనను ఆర్టిస్ట్ గా మరోసారి సినిమాల్లోకి తీసుకొచ్చారు. సుమారు 45 సంవత్సరాలుగా 1200 పైగా సినిమాలలో 6 బాషలలో నటించారు అలీ. ముఖ్యంగా కామెడీ పాత్రలలో ఆయన ఎక్కువగా నటించారు. యమలీల వంటి సినిమాలలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ మంచి హిట్ అందుకున్నారు. అయితే తొలిసారిగా ఆయన 1999లో అలీ రాజకీయాల్లోకి దగ్గుబాటి రామానాయుడు గారి కోసం తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత సుమారు 20 సంవత్సరాలు ఆయన అదే పార్టీలో కొనసాగారు. సుమారు 16 సంవత్సరాల క్రితం తన తండ్రి పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టుకుని ప్రజా సేవ చేసారు. సుమారు ఆయన సంపదలో 20% ఆయన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేసారు. అలాఇ విదేశాలలో ఏదైనా ఈవెంట్ ద్వారా డబ్బు వస్తే వాటిలో 60% ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ చేసేవారు. అయితే కొన్ని సంవత్సరాలుగా రాజకీయపరంగా వైసీపీ పార్టీలో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పని చేసిన అలీ 2024 ఎన్నికలలో పోటీ చేయాలని ఆశించినప్పటికీ టికెట్ దక్కలేదు. అయితే తాజాగా ఆయన ఒక వీడియో విడుదల చేస్తూ తాను ఇకపై ఏ రాజకీయ పార్టీలోనూ లేను అని, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అంటూ ప్రకటన ఇచ్చారు. అలాగే తాను ఇక నుండి సినిమాలు చేసుకుంటూ ఒక సాధారణ మనిషిలా ఉండాలి అనుకుంటున్నాను అని ఆయన అన్నారు.