విశాల్ యాక్షన్ షో… తమన్నా గ్లామర్ షో…

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, డైరెక్టర్ సుందర్ సి కాంబినేషన్ లో వస్తున్న సినిమా యాక్షన్. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో సల్మాన్ ఖాన్ హిట్ ఫిలిం ఏక్ థ టైగర్ షేడ్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. లీడ్ పెయిర్ మధ్య సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసిన విధానం, లొకేషన్స్, విశాల్ కాస్ట్యూమ్ డిజైన్స్… ఇలా టీజర్ లోని ప్రతి విషయం ఏక్ థా టైగర్ సినిమాని పోలి ఉండడం విశేషం. అయితే ఏక్ థా టైగర్ సినిమాలో సల్మాన్ ఖాన్ స్పై కాగా, యాక్షన్ సినిమాలో విశాల్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. యాక్షన్ టీజర్ లో విశాల్ చేసిన స్టంట్స్ బాగున్నాయి, టీజర్ లో వచ్చిన బీజీఎమ్, లొకేషన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో చెప్పుకోవాల్సింది తమన్నా గురించి. తన గ్లామర్ షో మిల్కీ బ్యూటీ బాగా అట్రాక్ట్ చేసింది, తన స్కిన్ షో మాస్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రాబట్టడంలో ఉపయోగ పడొచ్చు. అయితే తమన్నా కేవలం గ్లామర్ షోకి మాత్రమే పరిమితం కాకుండా సినిమా టైటిల్ కి తగ్గట్లు యాక్షన్ సీన్స్ కూడా చేసింది. తమన్నా చేసిన స్టంట్స్ ని టీజర్ లో కూడా అక్కడక్కడా చూపించారు. మొత్తానికి యాక్షన్ టీజర్… యాక్షన్ థ్రిల్లర్ గానే ఉంది.