Acharya Business: ఆచార్య ఖాతాలో మరో రికార్డు

Acharya Business: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా ఆచార్య. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మే 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో రాంచరణ్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. రాంచరణ్ సరసన పూజాహెగ్దే నటించనుందని సమాచారం.

ACHARYA PRE RELEASE BUSSINESS

అయితే విడుదలకు ముందే ఆచార్య రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్‌లో జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నైజాం రైట్స్‌ను వరంగల్ శ్రీను రూ.42 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక ఆంధ్రా సీడెడ్ కలిపి రూ. 60 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఓవర్సిస్‌ రైట్స్ కోసం రూ.20 కోట్లకు పైగా కోట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మెత్తంగా ఇప్పటివకే ఆచార్య రూ. 120కోట్ల మేర బిజినెస్ చేస్తున్నట్టు తెలుస్తోంది.