Acharya: లాహే లాహే అంటూ మెగాస్టార్ చిందులు..

Acharya: మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఆచార్య చిత్రం తెరెకెక్కుతున్న విష‌యం తెలిసిందే. సురేఖ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్ని ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక‌ ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి.. కాగా తాజాగా ఈ చిత్రంలో నుంచి లాహె లాహె అనే సాంగ్ లిరిక‌ల్ వీడియోను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం..

Megastar Chiranjeevi

లాహె లాహె లాహె లే కొండ‌ల‌రాజు బంగారు కొండ.. కొండ జాతికి అండ మ‌ద్ద‌రాతిరి లేచి మంగ‌ళ గౌరీ మ‌ల్లెలు కోసిందే అంటూ సాగే పాట‌ను రామ‌జోగ‌య్య‌శాస్త్రి లిరిక్స్ అందించ‌గా.. సింగ‌ర్స్ హారిక నారాయ‌ణ్‌, సాహిత్ చాగంటి ఈ పాట‌ను ఆల‌పించారు. ఈ సాంగ్ ప్ర‌త్యేకంగా వేసిన టెంపుల్ టౌన్ సెట్‌లో దినేష్ మాస్ట‌ర్ నేతృత్వంలో నృత్యాల‌ను షూట్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్‌, పూజా హెగ్దే, సోనూసూద్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రం మే 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.