Megastar: ఖ‌మ్మం షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి హైద‌రాబాద్ చేరుకున్న‌ ఆచార్య టీం

Megastar: మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప‌వ‌ర్ ఫుల్ మెగా ఎంట‌ర్ టైన‌ర్ ఆచార్య‌. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న ఈ Megastar చిత్రంలో కాజ‌ల్ – పూజా హెగ్డే క‌థానాయిక‌లు. మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ – కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిరంజ‌న్ రెడ్డి- రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌లు. ఇటీవ‌ల ఖ‌మ్మం షెడ్యూల్ తో చిత్ర‌బృందం బిజీగా ఉంది. ఈ షెడ్యూల్ లో Megastar చిరంజీవి- రామ్ చ‌రణ్ పై కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు.

acharya movie

తాజాగా ఈ షెడ్యూల్ విజ‌య‌వంతంగా పూర్త‌యింద‌ని నిర్మాత‌లు వెల్ల‌డించారు. నిర్మాత‌ల్లో ఒక‌రైన నిరంజ‌న్ రెడ్డి మాట్లాడుతూ-ఖ‌మ్మం షెడ్యూల్ ని ఎలాంటి ఆటంకాల్లేకుండా స‌క్సెస్ ఫుల్ గా పూర్తి చేసి తిరిగి హై‌ద‌రాబాద్ లో అడుగుపెట్టాం. Megastar చిరంజీవి -చ‌ర‌ణ్ పై కీల‌క స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్ లో చిత్రీక‌రించాం అని తెలిపారు. ఈ సినిమా మే 13న థియేటర్లలోకి రానుంది. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మణిశర్మ ఈMegastar చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.