Acharya: సిద్ధ సిద్ధ‌మ‌వుతున్నాడు.. చెర్రీ భుజం మీద మెగాస్టార్‌ చెయ్యి ఫోటో వైర‌ల్!

Acharya: మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య‌. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో మెగాస్టార్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది.. అలాగే విల‌న్ పాత్ర‌ను ప్ర‌ముఖ న‌టుడు రియ‌ల్‌హీరో సోనూసూద్ పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సిద్ధ పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ చేస్తున్నాడ‌నే విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే Acharyaఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఎంతోగానో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. దీంతో ప్రేక్ష‌కులు ఈ చిత్రం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

acharya

ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్రంకు సంబంధించి రామ్‌చ‌ర‌ణ్ ఓ ఫోటో వైర‌ల్ అవుతుంది. ఈ ఫోటోను స్వ‌యంగా రాంచ‌ర‌ణ్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేస్తూ.. ఇది కామ్రేడ్ మూమెంట్. Acharyaఆచార్య షూటింగ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నా తండ్రి మెగాస్టార్.. డైరెక్ట‌ర్ కొర‌టాల శివ గారితో టైం స్పెండ్ చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది అంటూ రాసుకొచ్చారు చెర్రీ. ఇంత‌కీ ఆ ఫోటో ఎలాగుందంటే.. రాంచ‌ర‌ణ్ భుజం పై మెగాస్టార్ చేతి వేసినట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఇక ఈ విష‌యంపై కొర‌టాల శివ స్పందిస్తూ.. సిద్ధ సిద్ధ‌మ‌వుతున్నాడు అని రిప్లై ఇచ్చాడు. ఇక ఈAcharya చిత్రంలో మ‌రో పాత్ర‌కు పూజాహెగ్దే న‌టిస్తుంది.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నారు. ఈ Acharyaచిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మే 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.‌