Acharya Movie: ఆర్మీ లుక్‌లో చిరు, చెర్రీ.. అదిరిపోయిందంతే!

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ఆచార్య‌. ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటు మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో రాంచ‌ర‌ణ్ సిద్ధ అనే పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. అయితే ప్ర‌స్తుతం ఈAcharya Movie చిత్ర షూటింగ్ భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఇల్లెందు సింగ‌రేణి బొగ్గు గ‌నుల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. కాగా ఈ నేప‌థ్యంలో ఆచార్య సెట్స్ నుంచి ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

Acharya

ఈ ఫోటోలో చిరు, చెర్రీ ఆర్మీ దుస్తుల్లో ఉండ‌గా.. వారికి Acharya Movie డైరెక్ట‌ర్ కొర‌టాల శివ సీన్ వివ‌రిస్తుండ‌డం క‌నిపిస్తుంది. ఇక్క‌డి బొగ్గు గ‌నుల్లో ఫైటింగ్ సీక్వెన్స్‌ల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఇక ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల‌పై రాంచ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. మే 13న Acharya Movie ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుండ‌గా.. పూజాహెగ్దే, సోనూసూద్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.