ఆర్ధిక నేర‌గాడిగా అభిషేక్ బచ్చన్…

హ‌ర్ష‌ద్ మెహ‌తా.. ఈ పేరు విన‌గానే మ‌న‌కు స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద కుంభ‌కోణం చేసిన ఆర్ధిక నేర‌గాడు గుర్తుకు వ‌స్తాడు. స్టాక్ బ్రోకర్ అయిన హర్షద్ మెహతా 1992 లో ఫైనాన్సియల్ క్రైమ్స్ చేసి ఎంతో మందిని మోసం చేశాడు. ఒక మాములు స్టాక్ బ్రోకర్ 5000 కోట్ల మోసం ఎలా చేశాడు అనేది పాయింట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను స్టాక్ మార్కెట్‌ను ఎలా మోసం చేశాడు? అందుకు అతన్ని పురిగొల్పిన పరిస్థితులేంటి? అసలు హర్షద్ మెహతా కథ ఏంటి? ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కుతున్న ది బిగ్ బుల్‌. అభిషేక్ బ‌చ్చ‌న్ హీరోగా రాబోతున్న ఈ సినిమాని మరో హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ నిర్మామించడం విశేషం. కుకీ గులాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని టాక్‌. 2012లో విడుద‌లైన‌ బోల్ బ‌చ్చ‌న్‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ క‌లిసి న‌టించారు. ఆ రిలేషన్ కారణంగానే అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ ని హీరోగా పెట్టి సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.