యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లోని నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. బడా నిర్మాతలు, డైరెక్టర్లు చిన్న హీరోలకు అవకాశాలు రాకుండా చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. సుశాంత్ సూసైడ్ చేసుకోవానికి వీళ్లే కారణమనే ఆరోపణలు వినిపించాయి. కొంతమంది మాత్రమే సినిమా ఇండస్ట్రీని శాసించడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వచ్చాయి.
ఈ వివాదం క్రమంలో చాలామంది స్టార్ హీరోల సినిమాలను ప్రేక్షకులు చూడకుండా నిషేధం విధించారు. తాజాగా ఈ వివాదంలోకి హీరో అభిషేక్ బచ్చన్ కూడా తలదూర్చాడు. బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌తో అభిషేక్ బచ్చన్ ‘యూ అనే సినిమాను నిర్మించాడు.
అయితే తన కోసం అమితాబ్ ఆ సినిమా తీయలేదని, ఆయన కోసం తాను సినిమా తీశానని విమర్శకులకు అభిషేక్ సమాధానం ఇచ్చాడు.