ఇండియన్ మైకేల్ జాక్సన్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం అభినేత్రి
. ఈ హారర్ కామెడీ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం అభినేత్రి 2
. నందితా శ్వేత, సప్తగిరి, సోనూసూద్ కీలక పాత్రల్లో నటించారు. విజయ్ దర్శకుడు. అభిషేక్ నామా, ఆర్. రవీంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 31న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. హారర్, కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
సామ్ సి.ఎస్. సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన రెడీ రెడీ.. సాంగ్ చాలా మంచి స్పందన వచ్చింది. ఈరోజు ` పిల్లండోయ్ ..చక్కని పిల్లండోయ్.. ..కుంకుమ కలరండోయ్.. చక్కని పిల్లా చక్కర బిల్లా...
సాంగ్ విడుదలైంది. హీరో, హీరోయిన్‌కి తన ప్రేమను టీజింగ్ స్టైల్లో తెలియజేసే సాంగ్ ఇది. ప్రభుదేవా, కోవై సరళ, తమన్నా, నందితా శ్వేత పెర్ఫామెన్స్ సినిమాకు హైలైట్ కానుంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆయంక బోస్, సంగీతం: శామ్ సి.ఎస్., ఎడిటింగ్: ఆంటోని.