భారీ ట్విస్ట్: బిగ్‌బాస్ నుంచి అభిజిత్ బయటికి?

బిగ్‌బాస్-4 మరో మూడు వారాల్లో ముగియనున్న క్రమంలో ఊహించని పరిణామాలు జరిగే అవకాశముంది. ఎవరు బయటికి వెళ్తారు?.. ఎవరు ఉంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్‌లో ప్రతివారం ఎలిమినేషన్ ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రతివారం ఎవరు హౌస్ నుంచి బయటికి వెళ్తారనే విషయం ముందే లీక్ అవుతూ ఉంటుంది. కానీ ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటికి అవుతారనేది ఇంకా బయటికి రాలేదు. ఈ వారం నామినేషన్స్‌లో అఖిల్, అవినాష్, అరియానా, మోనాల్ ఉన్నారు.

ABHIJIT

ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారితో అవినాష్‌కి తక్కువ ఓట్ల వచ్చాయి. దీంతో అతడు ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ ఎనిక్షన్ పాస్ వల్ల అవినాష్ సేఫ్ అవ్వడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదనే ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా విడుదైన బిగ్‌బాస్ ప్రొమో చూస్తే ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందని అనిపిస్తోంది.

ఈ ప్రొమోలో అభిజిత్‌పై నాగార్జున సీరియస్ అయ్యాడు. బిగ్‌బాస్ నుంచి బయటికి వెళ్లిపోవాలని సూచించాడు. దీంతో బిగ్‌బాస్ డోర్లు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్ నుంచి అభిజిత్ వెళ్లిపోతాడనే చర్చ జరుగుతోంది. ఇటీవల దెయ్యం టాస్క్‌లో జలజ ఇచ్చిన టాస్క్‌ను అభిజిత్ చేయకపోవడంపై నాగార్జున సీరియస్ అయ్యాడు. మోనాల్‌ని అఖిల్, అభిజిత్ బాగా ఎడిపించారని, అందుకని వారిద్దరిలో ఒకరు మోనాల్‌ని డేట్‌కి తీసుకెళ్లాలని టాస్క్ ఇచ్చారు.

కానీ ఈ టాస్క్ తాను చేయనని అభిజిత్ తేల్చిచెప్పశాడు. దీంతో టాస్క్ ఎందుకు చేయలేదని నాగార్జున ప్రశ్నించగా.. తాను మోనాల్‌ని ఎడిపించలేదని అభిజిత్ చెబుతాడు. దీంతో నాగార్జున వీడియోలు ప్లే చేసి చూపించగా.. అభిజిత్ సారీ చెబుతాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ రూల్స్ ప్రకారం తప్పు చేశావని చెప్పిన నాగ్.. డోర్లు ఓపెన్ చేయాలని బిగ్‌బాస్‌కి చెప్పగా డోర్లు ఓపెన్ అవ్వుతాయి